నేమ్ ప్లేట్ వేటలో ఫ్రంట్!
ఫ్రంట్ ఆవిర్భావాన్ని ఆటపట్టించిన వారు కూడా లేకపోలేదు. 'కాంగ్రెస్ మద్దతుతో ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వారు ఇప్పుడు కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రభుత్వాన్ని ేర్పాటు చేసేస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు' అని చంద్రశేకర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ వారు వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ మద్దతుదారులు ఈ విధంగా తన మానస పుత్రిక(మూడో ఫ్రంట్)ను గేలిచేయడం దేవెగౌడకు ఆగ్రహం కలిగించింది. 'తాము తప్ప మిగిలినవారెవరూ దేశాన్ని పరిపాలించడానికి పనికిరారని కాంగ్రెస్ అనుకుంటోంది. కేవలం ఇద్దరు కానిస్టేబుళ్ల కారణంగా చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ ను ప్రధాని చేశారు కాని పార్లమెంటులో అడుగుపెట్టనివ్వ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు కోసం అవే ప్రాంతీయ పార్టీల వెంట పడుతోంది' అని దేవెగౌడ కేంద్రంలో అధికార పార్టీని ఎగతాళి చేశారు.
Pages: -1- 2 News Posted: 17 March, 2009
|