'జయ హో'రు కర్ణకఠోరం!
'స్లమ్ డాగ్ లోని ఒరిజినల్ పాట చరిత్రలో ఓ మలుపురాయి. అంతకంటె ఉత్తమంగా ఎవరూ సంగీతాన్ని సృష్టించలేరు. కాని దాని పేరడీ కాంగ్రెస్ ను తిరోగమనం పట్టిస్తోంది. నిజానికి అది పార్టీ ప్రచారానికి ప్రయోజనం కంటె ఎక్కువగా హాని చేస్తోంది' అని బెగుళూరు వాక్ హార్ట్
హాస్పిటల్స్ వెబ్ ఇనీషియేటివ్స్ సేనేజర్ సుమీత్ రాయ్ వ్యాఖ్యానించారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో ఉపయోగించుకుని భంగపడిన 'ఇండియా షైనింగ్'ప్రచారంతో, కాంగ్రేస్ జయ హోను సరిపోల్చడానికి చాలామంది ప్రయత్నించారు. ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలు సైతం సందేహాలు వ్యక్తం చేశారు. 'రాజకీయ పార్టీల విభిన్న ప్రచార ధోరణులను భారత ఓటర్లు ఎన్నడూ సమర్దించలేదు. గతంలో బిజెపిని తిరస్కరించారు. ఇప్పడు మా పార్టీకి అదే గతి పట్టించవచ్చు' అన్నాడు పేరు వెల్లడించడానికి ఇష్టపడని దక్షిణ ఢిల్లీ యూత్ కాంగ్రెస్ సభ్యుడొకరు.
Pages: -1- 2 News Posted: 18 March, 2009
|