వెట్టోరి వీరోచిత సెంచరీ
మూడో సీమర్ మునాఫ్ పటేల్ కు కూడా కివీస్ ఇన్నింగ్సు ప్రారంభంలోనే వికెట్ లభించింది. బ్రెండన్ మెకల్లమ్ ఆఫ్ స్టంప్ కు అవతల పడిన బంతిని అనవసరంగా ఆడి రెండో స్లిప్ లో వున్న లక్ష్మణ్ చేతుల్లో పడేశాడు. లంచి విరామం తరువాత, వన్డేల్లో కివీస్ హీరో జెస్సీ రైడర్ ఈ సమయంలో త్వరత్వరగా పరుగులు తీయడం ప్రారంభించాడు. కెప్టెన్ వెట్టోరితో కలిసి టీ విరామ సమయానికి స్కోరును 162కు పెంచాడు. ఆ తరువాత స్కోరు 200 పరుగులు దాటింది. 63 ఓవర్లలో 209 పరుగుల వద్ద అప్పటికే సంచరీ చేసిన వెట్టోరి(118) వికెట్ మునాఫ్ పటేల్ కు దక్కింది. ఆ తరువాత బంతి, మునాఫ్ వేసిన యార్కర్ రూపంలో, కైల్ మిల్స్ వికెట్లను పడగొట్టింది. న్యూజిలాండ్ స్కోరు 246/8 వద్ద మునాఫ్ పటేల్ కు లభించిన హ్యాట్రిక్ ఛాన్స్ వృధా అయింది. పడిన శ్రమకు ప్రతిఫలంగా జెస్సీ రైడర్(102) కూడా తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు.
చివరకు న్యూజిలాండ్ 279 పరుగులకు ఆలౌట్ అయింది. జహీర్ ఖాన్ 2, ఇషాంత్ శర్మ 4, మునాఫ్ పటేల్ 3, హర్భజన్ సింగ్ 1 వికెట్లు పడగొట్టారు. ఆ తరువాత బ్యాటింగుకు దిగిన భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(22), గౌతమ్ గంభీర్(6) ఆట ముగిసే సమయానికి 29 పరుగులు సాధించారు.
Pages: -1- 2 News Posted: 18 March, 2009
|