బాలయ్యకు బావ లేఖ
ఒకరకంగా చెప్పాలంటే వాళ్లకంత తెలివి లేదులే అన్న అర్ధం స్ఫురించింది. మహనీయుడిగా ఈ రోజు మనం స్తుతిస్తున్న మీ నాన్నగారికి కుటుంబ సభ్యులుగా మనమందరం అన్యాయం చేయడంలో భాగస్వాములు కావడానికికారణం చంద్రబాబు. 'నీవు నా బిడ్డవైతే చంద్రబాబును కత్తితో పొడిచి, ఆ రక్తంతో తడిసిన కత్తిని తీసుకువచ్చి నాకు చూపించు' అని మీ నాన్నగారు చివరిరోజుల్లో చెప్పిన మాటలు మరచిపోయావా బాలయ్యా? బాబు బావను నిజంగా చంపమని ఆయన ఉద్దేశం కాదు. తన బాధను ఎలా చెప్పాలో తేలీక మీతో చెప్పిన మాటలుగా భావిస్తున్నాను. అప్పుడు మీగురించి చులకనగా మాట్లాడిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఏం చెప్పి రోడ్డెక్కించి తిప్పుతున్నాడో మరి! అక్క పురందరేశ్వరి పార్టీలోకి వస్తే మాకు అభ్యంతరం లేదని, అయితే మేముగా ఆహ్వానించం అనీ చెబుతున్నారు. ఒక్కసారి గతంలోకి వెళ్తే చంద్రబాబు తన అవసరం తీరాక ఎలా ప్రవర్తించాడో గుర్తుండే ఉంటుంది.
చిన్నమ్మ మంచి పేరు తెచ్చుకుందని కితాబిచ్చావు. చాలా సంతోషం. అలాగే రైట్ కేండిడేట్ ఇన్ రాంగ్ పార్టీ అన్నావు. అది కాలమే నిర్ణయిస్తుంది. అవినీతి అంటూ గోలపెడుతున్న చంద్రబాబుకు ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో మనకు తెలుసు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వనివన్నీ ఇప్పుడు ఆల్ ఫ్రీ బాబుగా వేషం వేసుకుని ఇస్తామనడం నమ్మశక్యంగా లేదు. టీవీలో చూశా, నీ గొంతు బాగా బొగురుపోయింది. ప్రచారం బాగా పొద్దుపోయేవరకు జరుగుతోందని పత్రికల్లో చదివా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో బాలయ్యా!' అంటూ వెంకటేశ్వరరావు లేఖ ముగించారు.
Pages: -1- 2 News Posted: 19 March, 2009
|