ఐపిఎల్ 'బుల్లెట్ ప్రూఫ్'!
ప్రస్తుతం తమ అవసరాలకు అనుగుణమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అద్దెకు తెచ్చే విషయాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. వాహనాలను బుల్లెట్ ప్రూఫ్ గా తయారుచేయడానికి పదిహేను రోజుల కంటె ఎక్కువ సమయం పడుతుందని నిర్వాహకులకు చెప్పగానే, ఎక్కడినుంచైనా అద్దెకు తీసుకు రాగలరా? అని అడిగారని, కాని అది కూడా అంత సులభసాధ్యం కాదని సోబ్తి వివరించారు. 'మేము ఎక్కువగా రాజకీయ నాయకులు, విఐపిల వాహనాలనే బుల్లెట్ ప్రూఫ్ చేస్తుంటాం. వాటిని అద్దెకు ఇవ్వడానికి వారు ఇష్టపడరు. అదికూడా ఈ ఎన్నికల సమయంలో. చూద్దాం ఏం జరుగుతుందో!' అని ఆయన చెప్పారు.
Pages: -1- 2 News Posted: 20 March, 2009
|