సంఘ్ చేతుల్లోకి బిజెపి?
ఆ తరువాత సంఘ్ తన 32 అనుబంధ సంస్థలలో తీసుకురావాలనుకుంటున్న మార్పులకు పూనుకుంటుంది. ఆ సంస్థలలో ఆరు ప్రజా బాహుళ్యంతో సంబంధాలు గలవి. పూర్తి కాలపు బాధ్యులు కొందరిని కీలకమైన బాధ్యతలతో సంస్థలకు పంపవచ్చునని సంస్థ ఆంతరంగికులు సూచించారు. ఈ మార్పులు ముందు ప్రాంతీయ స్థాయిలోను, ఆతరువాత జాతీయ స్థాయిలోను చోటు చేసుకుంటాయి.
ఆర్ఎస్ఎస్ ప్రతి సంవత్సరం మార్చిలో ప్రతినిధి సభను నిర్వహిస్తుంటుంది. ఈ సమావేశాలలో పూర్తి కాలపు వాలంటీర్లు, ఎగ్జిక్యూటివ్ అధిపతులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు తమ కార్యకలాపాలు, ప్రాంతీయ పరిస్థితుల గురించి చర్చిస్తుంటారు. ప్రతి మూడేళ్ళకు ఈ సమావేశాలు నాగపూర్ లో జరుగుతుంటాయి. ఈ సమావేశాలలోనే సంఘ్ సంస్థాగత అధిపతి అయిన ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కార్యనిర్వాహక వర్గాన్ని సంఘ్ ఎన్నుకుంటుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ భగవత్ ఈ సారి తిరిగి ఎన్నిక కానున్నారు.
ఈ సమావేశాలు రెండు విధాలుగా ప్రాముఖ్యం సంతరించుకుంటున్నాయి. ఒకటి - ఒక నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం. ఆర్ఎస్ఎస్ నాయకులు రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు - భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తి అంతకంతకు ఎక్కువవుతుండడం. పార్టీ తన రాజకీయ బలాన్ని విస్తరించుకోవడం లేదని, మాతృ సంస్థ కేడర్ల మద్దతు లేకుండా రాజకీయ లక్ష్యాలను సాధించలేకపోతున్నదని సంఘ్ భావిస్తున్నది.
స్వల్ప కాలిక దృక్పథం కన్నా కూడా ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై దీర్ఘకాలిక వైఖరిని సభ అనుసరిస్తుందని పార్టీ ఆంతరంగికులు చెబుతున్నారు. బిజెపి లేదా కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణాలు 2009లో పార్లమెంట్ లో మెజారిటీ పొందకపోవచ్చునని, ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండలేకపోవచ్చునని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది. అలా జరిగే పక్షంలో పరివార్ సంస్థలకు మార్గదర్శకత్వం కోసం 2009 సంవత్సరాంతానికి లేదా 2010 ఆరంభానికి సంఘ్ ఒక అజెండాను నిర్దేశిస్తుంది. అది సంఘ్ రూపకల్పన చేసి, పర్యవేక్షించే దేశవ్యాప్త ప్రచారోద్యమం కాగలదు.
Pages: -1- 2 News Posted: 20 March, 2009
|