సీట్లపై కూటమిలో ఫీట్లు!
మహా కూటమి భాగస్వామ్య పక్షాలు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ఎగరేసుకుపోతాయేమోనని భయపడడమే ఇందుకు కారణం. ఆ నాలుగు పార్టీలలో నిరాశ చెందిన ఆశావహుల కోసం ప్రజా రాజ్యం పార్టీ (పిఆర్ పి), కాంగ్రెస్ చూస్తున్నాయి. చివరి క్షణంలో జాబితాను విడుదల చేయడం ద్వారా మహా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆ విధంగా నిరాశ చెందిన ఆశావహులకు ఇతర పార్టీలకు వలస వెళ్ళి ఎన్నికలలో పోటీ చేసేందుకు వ్యవధి తక్కువ ఉంటుంది.
మహా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య వివాదాస్పదంగా ఉన్నశాసనసభ స్థానాలలో వరంగల్ తూర్పు, పాలకుర్తి, విజయవాడ సెంట్రల్, దొమ్మాట, అలేరు, నిజామాబాద్ రూరల్, బోధన్, వినుకొండ, సత్తెనపల్లి, మంగళగిరి, కూకట్ పల్లి, లోక్ సభ స్థానాలలో మహబూబ్ నగర్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం ఉన్నాయి. తమ అభ్యర్థులు ఈ నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేస్తారని మహా కూటమిలో ప్రతి ఒక్క పార్టీ చెబుతున్నది.
Pages: -1- 2 News Posted: 21 March, 2009
|