'సైకిలె'క్కుతున్న అలకలు
పటాన్ చెరునియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు ఆ సీయు సిపిఎంకు ఇస్తే ఓడిపోతామని పార్టీ నాయకులకు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడును కలిసి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణమ్మకు ఎట్టి పరిస్థితిలోనూ బాల్కొండ సీటు ఇవ్వ వద్దని కోరారు. ఆర్మూర్ లో పార్టీ పరిస్థితి అన్నపూర్ణ వల్లనే దెబ్బ తిందని, ఇప్పుడు ఆమెకు బాల్కొండ సీటు ఇవ్వాలని భావిస్తున్నారని, అలా చేస్తే కాంగ్రెస్ కు ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించారు. వరంగల్ సీటు కోసం గుండు సుధారాణి పట్టుపడుతున్నారు.
నిజామాబాద్ లో అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు టిఆరెస్ కు తలనొప్పి తగ్గడం లేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన టిఆరెస్ నాయకులు, కార్యకర్తలు సీట్స పంపకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏకంగా టిఆరెస్ భవన్ లోనే కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభ్యర్ధుల జాబితా వెలువడక ముందే పరిస్థితి ఈ విధంగా ఉండడంతో సీట్ల పంపకాలు పూర్తయిన తరువాత ఎలా ఉంటుందోనని తెలుగుదేశం నాయకులు ఆందోళన చెందుకున్నారు. కార్యకర్తల గొడవలను దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకాల చర్చలను రహస్యంగానే ఉంచుతున్నారు.
Pages: -1- 2 News Posted: 22 March, 2009
|