ద్రవ్య సంకోచం కాదు
ముంబై: ద్రవ్యోల్బణం 0.44 శాతానికి క్షీణించడంతో ద్రవ్య సంకోచం తలెత్తినట్లు ఆర్ధికవేత్తలు ఆందోళన చెందారు. సరుకుల ధరలు, ఉద్యోగాలు, ఆదాయాలు నిరంతరాయంగా క్షీణించడం, ఆర్దిక పరిస్థితి మరింతగా కుదించుకుపోయే స్థితిని ద్రవ్య సంకోచంగా (డిఫ్లేషన్) పిలుస్తారు. భారత దేశం ఇలాంటి దయనీయమైన స్థితిలోకి దిగజారిందా? నిపుణులు అలా జరగలేదంటున్నారు. 'ద్రవ్యసంకోచ భయాలు వాస్తవంలో కనబడటం లేదు' అని కేంద్ర సహాయ ఆర్ధిక మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మీడియాకు తెలిపారు. 'మనం ద్రవ్యోసంకోచ పరిస్థితుల్లో లేము. కేవలం ప్రతి ద్రవ్యోల్బణం (డిస్ ఇన్ఫ్లేషన్) పరిస్థితులు మాత్రమే కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం భూ మార్గం పట్టింది. సరకుల ధరలు అత్యున్నత స్థాయి నుండి క్రమంగా తగ్గుతున్నాయి. సరకుల ధరలు అత్యంత వేగంగా కుప్పకూలిపోయిన సందర్భాన్ని డిఫ్లేషన్ అంటే ద్రవ్య సంకోచం అని పిలుస్తారు. ద్రవ్య సంకోచ కాలంలో ప్రజలు ఖర్చు పెట్టడం మానివేస్తారు. ధరలు ఇంకా తగ్గుతాయని కలలు కంటారు. మనం ఇలాంటి పరిస్థితుల్లో లేము' అని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్దికవేత్త రూప రెజి నిశ్చర్ తెలిపారు.
వినియోగదారుల సూచిక ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఉన్న సందర్బంలో మనం ద్రవ్య సంకోచం గూర్చి చర్చించడం హాస్యాస్పదం. 'టోకు ధరల సూచిక్ తగ్గుతున్నప్పటికీ వినియోగదారుల ధర సూచికి ఇప్పటికీ అత్యన్నత స్థాయిలో ఉది. ఆహార పదార్ధాలు, ప్రాథమిక సరుకులు, ఇళ్ల ధరలు తగినంతగా క్షీణించలేదు. ద్రవ్య సంకోచం గురించి చర్చించే కంటే వినియోదారుల ధరల సూచిని తగ్గించడం పై కేంద్రీకరించాలి' అని రూప తెలిపారు. మనం ప్రతి దవ్యోల్బణాన్ని మాత్రమే చూస్తున్నాము, ద్రవ్య సంకోచాన్ని కాదు. ప్రతి ద్రవ్యోల్బణం సందర్బంలో ధరల ధరల పెరుగుదల రేటు తగ్గుతుందే గాని, ధరలు తగ్గవు. దీన్ని ధరల తగ్గడంగా గుర్తించలేము. టోకు ధరల సూచి మార్చ్ 7న 0.44 శాతం చేరినప్పటికి సరకుల ధరల స్వల్పంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణంగా పిలుస్తాము. టోకు ధరల సూచి 2008 ఆగష్టులో 13 శాతం అత్యున్నత స్థాయికి చేరింది. ఆప్పటి నుండి క్రమంగా క్షీణించింది.
Pages: 1 -2- News Posted: 22 March, 2009
|