ద్రవ్య సంకోచం కాదు
టోకు ధరల సూచిక అపసవ్య దిశలోకి వెళ్లిననాటి నుండి వినియోగదారుల ధరలు తగ్గడం ప్రారంభింస్తాయి. ధరల తగ్గుదలలో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం ఈ పరిస్థితిని ప్రతి ద్రవ్యల్బణంగా పిలుస్తాము. అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ దేశాల్లో ద్రవ్యోల్బణ రేటు అపసవ్యంగా నడవడమే కాదు, వాటి ఆర్ధిక వ్యవస్థలు కుంచించుకు పోయాయి. దాంతో ఆ దేశాలు ద్రవ్య సంకోచ పరిస్థితుల్లోకి జారిపోయినట్లే. ఆ దేశాల ఆర్ధిక సంస్థలు, రుణ మార్కెట్లు, బ్యాంకులు, ఆటోమొబైల్ పరిశ్రమలు కుప్పకూలిపోవడంతో అక్కడి ప్రభుత్వాలు ద్రవ్య సంకోచాన్ని ఎదుర్కునేందుకు వేల కోట్ల డాలర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి.
భారత దేశం ద్రవ్య సంకోచ ప్రభావం నుండి సాపేక్షికంగా సురక్షితంగా ఉన్నట్లేనా? క్లుప్తంగా చెప్పాలంటే - ఎవరికి తెలుసు? ప్రపంచ ఆర్ధిక మాంద్యం కొనసాగుతూ, అమెరికా, యూరప్, జపాన్ ల ఆర్దిక వ్యవస్థలు ద్రవ్య సంకోచంలో ఉంటే భారత దేశం కూడా దెబ్బతినకుండా ఉండగలదా? గత రెండు మూడు మాసాలుగా సరకుల ధరలు తగ్గినప్పటికీ గత ఏడాది కంటే తక్కువగా మాత్రం లేవు. ద్రవ్య సంకోచం పరిస్థితుల అంచులో ఉన్నామే గాని, ద్రవ్య సంకోచ పరిస్థితులు దేశంలో నెలకొనలేదు. మనం ద్రవ్యోసంకోచంలోకి వెళ్లినట్లయితే, మొదటగా జిడిపి అభివృద్ధి గణనీయంగా పడిపోతుంది. ఈ పరిస్థితి అమెరికాలో ఉంది. అక్కడ ధరలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఉత్పత్తులు మందగించాయి. భారత్ లో జిడిపి కుంచించుకపోవడం లేదు. కేవలం వృద్ధి రేటు మాత్రమ స్వల్పంగా క్షీణించింది. రుణ ప్రవాహాలను పునరుద్ధరిస్తేనే ఈ పరిస్థతిలో మెరుగొస్తుంది.
Pages: -1- 2 News Posted: 22 March, 2009
|