ఫోర్'ట్వంటీ' ఎవరు?
ప్రతి జట్టూ సొంత గ్రౌండ్ లోను, ఇతర జట్ల స్టేడియాల్లోను ఆడుతూండగా, అభిమానుల విధేయతను సృష్టించి పెంపొందించుకునే లక్ష్యంతో, ముంబాయి నగరం కేంద్రంగా రూపుదిద్దుకుంది ఐపిఎల్ ట్వంటీ టోర్నమెంట్. కానీ ఇప్పుడా టోర్నమెంట్ పరాయి దేశాలకు తరలిపోనుండడంతో, ఆ లక్ష్యానికి అర్ధం లేకుండా పోయింది. ముంబాయి, పంజాబ్, కోల్ కటా వంటి భారతీయ నగరాలకు చెందిన జట్లకు హుషారివ్వమంటే ఆ దేశంలో అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి! ప్రారంభ సంవత్సరంలో అభిమానులను, వీక్షకులను ఉర్రూతలూగించిన ఐపిఎల్ పోటీలను ఈ యేడాది స్వదేశంలో చూడకుండా చేసినందుకు ఎవరిని తప్పు పట్టాలి?
Pages: -1- 2 News Posted: 22 March, 2009
|