నక్సల్ ఊసే లేని ప్రచారాలు
నక్సలైట్లు కూడా 'ఎన్నికల బహిష్కరణ'కు పిలుపు ఇస్తుండేవారు. దీనితో రాజకీయ నాయకులు వారితో రహస్యంగా ఒప్పందాలు చేసుకుంటుండేవారు. ఈసారి రాష్ట్రంలో మావోయిస్టుల నుంచి ఎన్నికల బహిష్కరణకు అటువంటి పిలుపు రాలేదు. నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టు విభాగం మాత్రమే వోట్లు వేయవద్దని వోటర్లకు ఈ సారి పిలుపు ఇచ్చింది.
ప్రజా రాజ్యం పార్టీ (పిఆర్ పి), టిఆర్ఎస్ మాత్రమే తమ ఎన్నికల ప్రణాళికలలో తిరిగి మావోయిస్టుల ప్రస్తావన తీసుకువచ్చాయి. అయితే, మేనిఫెస్టోలో ప్రస్తావించడం తప్పిస్తే, పార్టీ నాయకత్వం నక్సలైట్లతో ఇతర రాజకీయ పార్టీలు అవగాహన కుదుర్చుకున్నాయంటూ ఆరోపణలేవీ చేయలేదు. 'పిఆర్ పి నక్సలిజాన్ని సాంఘిక, ఆర్థిక సమస్యగా గుర్తిస్తున్నది. మా పార్టీ కనుక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే వారితో చర్చలు జరపగలం' అని పార్టీ ఉపాధ్యక్షుడు సి. ఆంజనేయరెడ్డి చెప్పారు.
ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక చర్యల ప్రభావం కారణంగా మావోయిస్ట్ కేడర్ పొరుగున ఉన్న ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు తమ స్థావరాలను మార్చుకున్నది. దట్టమైన నల్లమల అడవులలో మావోయిస్టులు భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నారు. రాష్ట్ర నక్సల్ నాయకులు ఒరిస్సా, మహారాష్ట్రలలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి ఈ చర్య ఫలితంగా రాష్ట్రంలో ఒకప్పుడు మావోయిస్టు ప్రాబల్యం గల లోతట్టు ప్రాంతాలలో నాయకులు, అభ్యర్థులు ఎటువంటి భయమూ లేకుండా ప్రచారం నిర్వహించుకోవడానికి ఆస్కారం కలిగింది.
Pages: -1- 2 News Posted: 22 March, 2009
|