దిగ్విజయ్ శపథం!
కాగా, రాజకీయ నాయకులు తాము చెప్పేది చేయరని అందరూ భావిస్తుంటారని, అందుకు వారు విమర్శలకు గురవుతుంటారని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. అయితే, 2003లో తాను చెప్పిన మాటనే తాను పాటిస్తున్నందున ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా తనను ఒత్తిడి చేయరాదని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో రెండు నియోజకవర్గాలలో దిగ్విజయ్ సింగ్ పేరు వినిపిస్తున్నది. వాటిలో ఒకటి రాజ్ గఢ్. ఆయన తమ్ముడు లక్ష్మణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు. మరొక ఇండోర్. అక్కడ సుమిత్రా మహాజన్ వరుసగా ఆరు పర్యాయాలు గెలుపొందారు.
సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన భారత మాజీ ఒలింపిక్ హాకీ క్రీడాకారుడు అస్లామ్ షేర్ ఖాన్ కూడా ఈ ఎన్నికలలో దిగ్విజయ్ సింగ్ పోటీ చేయాలని కోరుతున్నారు.అయితే, తాను ఎన్నికలలో పోటీ చేయబోనని దిగ్విజయ్ సింగ్ పదేపదే స్పష్టం చేశారు. కాని కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పేరు మాత్రం పలు మీడియా వార్తలలో చోటు చేసుకుంటూనే ఉన్నది.
Pages: -1- 2 News Posted: 22 March, 2009
|