ఎన్టీఆర్ vs లోకేష్!
లోకేష్ పార్టీ ప్రచార వ్యూహాల రూపకల్పనలో కూడా నిమగ్నం అవుతూ, టిడిపి ప్రచార ప్రకటనలను రూపొందించడంలో మురళీమోహన్, కె. రాఘవేంద్ర రావు వంటి సినీ ప్రముఖులను కలుసుకుంటున్నారు. లోకేష్ ఈ సినీ ప్రముఖులతో పార్టీ ఎన్నికల ప్రచార సామగ్రి గురించి కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
టిక్కెట్ ఆశావహులకు లోకేష్ ఆశ్రయ కేంద్రంగా కూడా మారారు. ఆశావహులు కొందరు పార్టీ టిక్కెట్ సంపాదించేందుకై స్వయంగా లోకేష్ ను కలుసుకుంటున్నారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ స్థానంలో పోటీకి టిడిపి టిక్కెట్ ను ఆశిస్తున్న డి. రోజా రాణి తన అభ్యర్థిత్వం గురించి మాట్లాడేందుకై ఇటీవల లోకేష్ తో అపాయింట్ మెంట్ కోరారు. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) కూడా టిక్కెట్ల కోసం లోకేష్ సిఫార్సులు కోరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Pages: -1- 2 News Posted: 23 March, 2009
|