ఐపిఎల్ ఛాన్స్ ఎలా దక్కింది?
ఐపిఎల్ టోర్నమెంట్ ప్రారంభ తేదీని ఏప్రిల్ 18కి మార్చడంతో, టోర్నమెంట్ జరిగే రోజుల్లో దక్షిణాప్రికాలో నెలకొని ఉండే అనుకూల వాతావరణం ఆ దేశానికి పోటీలను తరలించడానికి కారణాల్లో ఒకటయింది. దక్షిణాప్రికాలోని ప్రసార సాధనాలు సూపర్ స్పోర్ట్స్, సొతాఫ్రికన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ నుంచి అక్కడి క్రికెట్ బోర్డుకు ఎటువంటి అవరోధాలు ఎదురుకావు. అంతే కాకుండా అక్కడ ఈ సీజన్ లో జరిగే చివరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఏప్రిల్ 17న ముగుస్తుంది. అదే ఇంగ్లండ్ లో అయితే ఐపిఎల్ పోటీలు జరిగే సమయంలోనే వెస్టిండీస్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ జరుగుతుంటుంది.
Pages: -1- 2 News Posted: 25 March, 2009
|