ఐపిఎల్ డీల్ 8200 కోట్లు!
ఐపిఎల్ ఒప్పందాన్ని అర్థంతరంగా ఈ నెల 16న రద్దు చేసిన తరువాత బొంబాయి హైకోర్టులో మూడు వారాల పాటు సాగిన వివాదం ఈ తాజా ఒప్పందంతో ముగిసింది. ఏ ఇతర సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకోకుండా ఐపిఎల్ ను మొదట్లో నిరోధించిన తరువాత కోర్టు ఆ ఇంజంక్షన్ ను తొలగించింది. కోర్టు ఈ కేసుపై తిరిగి ఈ నెల 30 నుంచి విచారణ జరపవలసి ఉంది.
ఇది ఇలా ఉండగా, లీగ్ షెడ్యూల్ కు ఐపిఎల్ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. దానిని ఏ సమయంలోనైనా విడుదల చేయవచ్చు. ఐపిఎల్ సిఇఒ సుందర రామన్ క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్ఎ) క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ బ్రియాన్ బాసన్ తో కలసి ఈ షెడ్యూల్ రూపకల్పన కోసం జోహాన్నెస్ బర్గ్ లోని ఒక హోటల్ లో చర్చలు జరుపుతున్నారు. 'అది ఏ సమయంలోనైనా విడుదల కావచ్చు. మేము తుది మెరుగులు దిద్దుతున్నాం' అని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి జోహాన్నెస్ బర్గ్ నుంచి తెలియజేశారు. ప్రతి ఫ్రాంచైజీకి ఒక 'బేస్' ఇస్తారా అనేది మోడి వెల్లడించలేదు.
ఐపిఎల్ జట్లకు బేస్ లభించకపోవచ్చునని, ఆరు వేదికలు జోహాన్నెస్ బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజబెత్, కేప్ టౌన్, బ్లూమ్ ఫాంటైన్, ప్రిటోరియా మాత్రమే ఉండడం ఇందుకు కారణమని దక్షిణాఫ్రికాలో క్రికెట్ వర్గాలు సూచించాయి. ఫైనల్ జోహాన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరగవచ్చు. ఐపిఎల్ రెండవ సీజన్ కు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో శ్రీకారం చుడతారు.
Pages: -1- 2 News Posted: 26 March, 2009
|