చంద్రగిరి 'రాణి' ఎవరో?
'ఈ పర్యాయం టిడిపి, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉండబోతున్నది. రెడ్డి వోటర్ల సంఖ్య గణనీయంగా ఉన్న చంద్రగిరిలో తిరుపతి రూరల్ ప్రాంతాన్ని చేర్చడంతో కాంగ్రెస్ కే పరిస్థితి అనుకూలంగా ఉండనున్నది. కాని చిత్తూరులో ఐరాలను, పూతలపట్టులో పులిచెర్లను విలీనం చేయడం అరుణకుమారి అవకాశాలకు విఘాతం కలగవచ్చు. ఆ రెండు సెగ్మెంట్లలో కమ్మ వోటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు' అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.
గల్లా అరుణకుమారి తొలి శాసనసభ్యురాలు అయినప్పటికీ, ఈ నియోజకవర్గం నుంచి ఆమె మూడు సార్లు (1989, 1999, 2004 ఎన్నికలలో) గెలుపొందినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో రెడ్డి కులస్థులలో ఒక వర్గం ఆమెపై కత్తి కట్టిందని, ఆమె వారిని పక్కకు పెట్టేశారని అభిజ్ఞ వర్గాలు పేర్కొన్నాయి. 'ఈ కారణంగా ఆమెకు అవకాశాలు దెబ్బ తిని రోజా, రమణి లబ్ధి పొందవచ్చు' అని రాజకీయ పరిశీలకుడు ఒకరు సూచించారు. కాగా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిజెపి రీసర్చ్ స్కాలర్, పార్టీ సీనియర్ నాయకుడు గాలి ధనంజయ నాయుడు కుమార్తె పుష్పలతను తన అభ్యర్థిగా ఎంపిక చేసింది. అభ్యర్థులు అందరిలోకి చిన్నదైన పుష్పలత గ్రామీణ చంద్రగిరి రూపు రేఖలు మార్చడం తన లక్ష్యమని చెప్పారు.
ప్రజారాజ్యం తరఫున కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన సైకం జయచంద్రారెడ్డి ఈ సీటుపై కన్ను వేశారు. కాని 'అందరూ మహిళలే' ఉన్న ఈ పోటీని మరింత రసవత్తరం చేయడానికి రెడ్డి భార్య సాయి రమణీ రెడ్డిని నిలబెట్టాలని పార్టీ అధినేత చిరంజీవి పట్టుదలతో ఉన్నారు. 2004 ఎన్నికలలో నగరి నియోజకవర్గంలో ఓడిపోయిన రోజాకు ఆమె స్వస్థలం చిన్నగొట్టిగల్లులోను, రామచంద్రపురం మండలంలోను చెప్పుకోదగిన బలం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
రామచంద్రపురం మండలంలో టిడిపి ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. 'రోజా, రమణి ఇద్దరూ కొన్ని ప్రాంతాలలో రెడ్డి కులం వోట్లపై కన్ను వేస్తున్నారు' అని ఒక పరిశీలకుడు పేర్కొన్నారు. చిరంజీవి ఆకర్షణ శక్తి వల్ల రమణి లబ్ధి పొందవచ్చని, తిరుపతి నుంచి చంద్రగిరి వరకు ఆయన ఆకర్షణ ప్రభావం ఉండవచ్చని పార్టీ వర్గాలు సూచించాయి. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయనున్న విషయం విదితమే. మరొక ముఖ్య విషయమేమంటే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ టిక్కెట్ తో 1978 ఎన్నికలలో విజయం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసింది చంద్రగిరిలోనే. అయితే, ఆయన 1983 ఎన్నికలలో ఓడిపోయారు. ఆతరువాత ఆయన టిడిపిలో చేరి కుప్పం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు నలుగురు రాణులు రంగంలో దిగుతున్నందున ఏ రాణిని చంద్రగిరిలో విజయం వరిస్తుందనేదే ప్రశ్న.
Pages: -1- 2 News Posted: 26 March, 2009
|