దేశం ఆఫీసులో హై డ్రామా
నగర శివారులో ని ఆరు నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంతపు(సెటిలర్స్) ఓటర్లు 50 శాతానికి పైగా ఉన్నందున తమ పార్టీకే ఈ సీట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సమయం చూసి కేసిఆర్ కు షాక్ ఇచ్చారని, అయన దిగివచ్చి చంద్రబాబుకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుదని వారు కోపంతో అన్నారు. ఇకనైనా కెసిఆర్ మహాకూటమి అభ్యర్ధుల గెలుపునకు సమిష్టి బాధ్యత స్వీకరిస్తే బాగుంటుందని వారు సూచించారు. టిఆరెస్ కు కేటాయించిన సీట్లలో తెలుగుదేశం అభ్యర్ధులు బి ఫారంతో నామినేషన్లు వేయడంతో టిఆరెస్ శ్రేణుల్లో కలకలం చెలరేగింది. చంద్రబాబు సూచన మేరకే తమ సీట్లలో తెలుగుదేశం నాయకులు హడావిడిగా నామినేషన్ వేశారన్నవార్త తెలియడంతో టిఆరెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. టిఆరెస్ సీట్లలో తెలుగుదేశం అధికారికంగా అభ్యర్దులను నిలబెట్టడంతోఆగ్రహించిన టిఆరె్నాయకులు, కార్యకర్తలుఎన్టీఆర్ భవనంపై దాడిేయడానికి వస్తున్నారన్నసమాచారం తెలుగుదేశం వర్గాలకు అందింది. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ భవనం సిబ్బంది జూబ్లీ హీల్స్ పోలీసులకు ఈ విషయం తెలిపారు.పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి, పరిస్థితిని సమీక్షించి సెక్యూరిటీ ఏర్పాటుచేశారు.
టిఆరెస్ శ్రేణులు చంద్రబాబు ఇంటికి కూడా వెళ్తారని సమాచార అందుకున్న తెలుగుదేశం కార్కర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి రక్షణగా వెళ్లారు. టిఆరెస్ కార్యకర్తలు తాడో పేడో తేల్చుకుంటామని చంద్రబాబు ఇంటి వద్ద మకాం వేశారు. మరికొన్ని గంటల తరువాత కెసిఆర్ మహబూబ్ నగర్ నుంచి నేరుగా చెద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కెసిఆర్ రాకతో సమస్య ఒక కొలిక్కి వస్తుందంటూ తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.
Pages: -1- 2 News Posted: 31 March, 2009
|