పీటర్ కు పిఆర్పీ సీటా!
సామాజిక అజెండాతో ప్రజల వద్దకు వెళ్తున్న పార్టీకి దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని, ప్రత్యర్ధులకు మరో ప్రచారాస్త్రం ఇచ్చినట్టు అవుతుందని పార్టీ సభ్యులు పలువురు అభిప్రాయపడుతున్నారు. పీటర్ సుబ్బయ్య గత చరిత్రను ప్రధానంగా తెరమీదకు తెచ్చే అవకాశాలున్నాయని, అదే జరిగితే సొంత పార్టీనుంచే వ్యతిరేకత రావచ్చని హెచ్చరిస్తున్నారు. సుబ్బయ్యపై గల కేసుల్లో కొన్ని విచారణ దశలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఆయన సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వస్తోందని ఆ జిల్లాకు చెందిన నాయకుడొకరు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సత్యవేడులో గెలుపు మాట ఎలా వున్నా, ఇతర ప్రాంతాల్లో కూడా పార్టీ పట్ల వ్యతిరేక అభిప్రాయం వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని సీనియర్ నాయకులు అంటున్నారు.
Pages: -1- 2 News Posted: 1 April, 2009
|