విజయనగరంలో బొత్స హవా
విజయనగరం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ టిక్కెట్ ను పార్టీ సీనియర్ నాయకుడు పెన్మెత్స సాంబశివరాజు ఆశించి, భంగపడి పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశంలో చేరారు. జిల్లాలో మొత్తం మీద అసమ్మతులు, అసంతృప్తులు, కప్పగంతులు జోరుగానే సాగుతున్నాయి, మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల 147 నామినేషన్లు దాఖలుకాగా, స్క్రూటినీలో 25 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. లోక్ సభ స్థానానికి మొత్తం 14 నామినేషన్లు దాఖలు కాగా ఒకదానిని మాత్రమే ఆ తరువాత తిరస్కరించారు. జిల్లా కాంగ్రెస్ ను తన కనుసన్నల్లో నడిపిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ హవాకు ఈ ఎన్నికలలో చెక్ పెట్టాలని అటు తెలుగుదేశం, ఇటు ప్రజారాజ్యం పార్టీలు ముందుకు దూసుకు వెళ్తూ, ఆయన అవినీతి, అరాచకాలను, కుటుంబ పాలనను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారాస్రాలు సంధిస్తున్నాయి.
మంత్రి బొత్స చీపురుపల్లి నుంచి, భార్య ఝాన్సీలక్ష్మి వజయనగరం లోక్ సభ స్థానానికి, తమ్ముడు అప్పలనరసయ్య గజపతినగరం నుంచి, సమీప బంధువు, జడ్పీ చైర్ పర్సన్ బి.అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధులుగా పోటీలో ఉన్నారు. మరోవైపు మంత్రి బొత్స రాజకీయ గురువైన పి.సాంబశివ రాజువిజయనగరం లోక్ సభ టిక్కెట్ ఆశించి, భంగపడి పార్టీకి రాజీనామా చేశారు.
Pages: -1- 2 News Posted: 2 April, 2009
|