పరువు నిలిపిన 'టెయిల్'
టెండుల్కర్ నిష్క్రమణ తరువాత భారతజట్టు మిడిలార్డర్ పతనం ప్రారంభమయింది. వివిఎస్ లక్ష్మణ్ 4, యువరాజ్ సింగ్ 9, రాహుల్ ద్రవిడ్ 35 పరుగులకు ఔటయ్యారు. దాంతో 2 వికెట్ల నష్టానికి 165 స్కోరుతో పటిష్టంగా కనిపించిన ధోని సేన టీ విరామ సమయానికి 190 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ధోని 89 బంతుల్లో 52 పరుగులు, హర్భజన్ సింగ్ 78 బంతుల్లో 60 పరుగులు చేసి ఏడో వికెట్ భాగస్వామ్యానికి అత్యంత విలువైన 79 పరుగులు జతచేశారు. ఈ ఇద్దరి తరువాత జహీర్ ఖాన్ విజృంభించాడు. కివీస్ బౌలర్ల చేతులు కట్టేసి, 23 బంతుల్లో 33(6ఫోర్లు)పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మార్టిన్ 3, సౌదీ 2, ఓ బ్రియన్ 2, ఫ్రాంక్లిన్ 1 జెస్సీ రైడర్ 1 వికెట్లు పడగొట్టారు. భారత జట్టులో దినేష్ కార్తిక్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని, న్యూజిలాండ్ జట్టులో జేమీ హౌ స్థానంలో డేనియల్ ఫ్లిన్, జీతన్ పటేల్ స్థానంలో టిమ్ సౌదీ ఈ టెస్ట్ కు ఎంపికయ్యారు.
Pages: -1- 2 News Posted: 3 April, 2009
|