మహాకూటమిలో గందరగోళం!
ఈ వైఖరి ఇటు సిపిఐతో పాటు తెలుగుదేశం, టిఆరెస్ లకు కూడా రుచించడం లేదు. ఇలా పరస్పర పోటీలతో ఉమ్మడి లక్ష్యమైన కాంగ్రెస్ ను ఓడించే అంశం పక్కకు పోయే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పై తిరుగులేని ఆధిపత్యం సాధించాలని యోచించిన చంద్రబాబు, అందుకు అవసరమైన బలగాన్ని కూడదీసుకున్నప్పటికీ అనూహ్యమైన సంఘటనలతో అవాక్కయ్యారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహాకూటమిలో ఈ విధమైన గందరగోళం నెలకొనడంతో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించిందని, తిరుగుబాటు అభ్యర్ధులకు గాలం వేయడానికి కసరత్తు మొదలుపెట్టిందని తెలిసింది. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం ప్రశ్నార్ధకం అవుతుందేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 4 April, 2009
|