పోటీ తీవ్రం, ప్రచారం ఉధృతం
తెలంగాణలోని అన్ని(119)స్థానాల్లో కాంగ్రెస్, 53 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నాయి. మన పార్టీకి కేటాయించిన 6 సీట్లు పోను మిగిలినవాటికి ప్రజారాజ్యం పోటీ చేస్తోంది. మొత్తంమీద 154 స్థానాలకు ఒంటరిగా 60 స్థానాలు గెలుచుకుంటామని తెలుగుదేశం వర్గాలు చెబుతుండగా60 నుంచి 70 స్థానలు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇక ప్రజారాజ్యం అయితే 40 స్థానాలలోపే సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కంటె ప్రజాకాజ్యం పార్టీకే తిరుగుబాటు అభ్యర్ధులు ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు చాలా చోట్ల బలహీనమైన అభ్యర్ధులు పోటీలో ఉండడంతో ప్రజారాజ్యం భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 5 April, 2009
|