రైలింజన్ కు రెబెల్స్ పొగ
తునిలో దాడిశెట్టి రాజా, చోడిశెట్టి త్రిమూర్తిస్వామి రెబెల్స్ గా బరిలో దిగారు. జగ్గంపేటలో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన తుమ్మలపల్లి రమేష్ పిఆర్పీకి తలనొప్పిగా మారారు. కాకినాడర రూరల్ సీటు ఆశించిన నలుగురైదుగురు అభ్యర్ధులు కన్నబాబుకు వ్యతిరేకంగా తయారయ్యారు. వారిలో ఒకరిని నాగబాబు సిఫార్సుతో కన్నబాబు తనవైపు తిప్పుకోగలిగారు. మామిడాల వెంకటేష్ రెబెల్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. కాకినాడ సిటీలో డాక్టర్ కొండమూరి సత్యనారాయణ రెబెల్ గా పోటీలో ఉండగా, బిసిలకు చెందిన ఉద్దండ రాజ్యలక్ష్మి కూడా పిఆర్పీ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగారు.
Pages: -1- 2 News Posted: 6 April, 2009
|