మన ఇవిఎంలకు గిరాకి
బెల్ కాకుండా హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్) కూడా ఇవిఎంలను ఉత్పత్తి చేస్తున్నది. రెండు సంస్థలూ ఎన్నికల కమిషన్ కు ఇవిఎంలను సరఫరా చేస్తున్నాయి. ఇసిఐఎల్ ఉత్పత్తి చేసిన ఇవిఎంలను ప్రభుత్వం విదేశాలకు సరఫరా చేసింది కూడా. తమ సంస్థ తయారు చేసిన సుమారు 4140 ఇవిఎంలను క్రితం సంవత్సరం భూటాన్ ఎన్నికల కోసం సరఫరా చేసినట్లు ఇసిఐఎల్ చైర్మన్ కె.ఎస్. రాజశేఖరరావు తెలియజేశారు. 'శ్రీలంక, ఘనా, దక్షిణాఫ్రికా, నైజీరియా, బంగ్లాదేశ్ వంటి పెక్కు ఇతర దేశాలు కూడా ఈ యంత్రాల కొనుగోలు పట్ల అమితాసక్తి కనబరిచాయి' అని ఆయన తెలిపారు. కొత్త ఇవిఎంలలో ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ, చాలా దేశాలు మరిన్ని మార్పులతో ఇవిఎంల రూపకల్పనను కోరుతున్నాయి. 'మేము సరఫరా చేసే, ఏప్రిల్-మే ఎన్నికలలో ఉపయోగించే ఇవిఎంలలో ఇన్-బిల్ట్ క్లాక్ లు, అంధుల కోసం బ్రెయిలీ మార్కింగ్ లు వంటి కొత్త వసతులు అనేకం ఉంటున్నాయి. కాని ఈ యంత్రాల పట్ల ఆసక్తి కనబరుస్తున్న పలు దేశాలు తమ అవసరాలకు తగినట్లుగా మార్పులు కోరుతున్నాయి' అని నెవాస్కర్ తెలియజేశారు. ఇవిఎం ధర పన్నులతో కలిపి సుమారు రూ. 9800. అధికారులు ధరను సూచించడానికి నిరాకరిస్తున్నప్పటికీ విదేశాలకు సరఫరా చేసిన ఇవిఎంల ధర కూడా ఇదే శ్రేణిలో ఉన్నట్లు తెలుస్తున్నది.
Pages: -1- 2 News Posted: 6 April, 2009
|