లగడపాటి సంపన్న అభ్యర్థి
కాగా, చంద్రబాబు నాయుడు వద్ద రూ. 23,400 మాత్రమే నగదు బ్యాలెన్స్, రూ. 11,26,453 వివలు చేసే డిపాజిట్లు ఉన్నాయి. అయితే, ఆయన భార్య భువనేశ్వరికి ఆయన కన్నా ఎక్కుపగానే ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబుకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రూ. 3.30 కోట్లు, రూ. 8.89 కోట్లు విలువ చేసే రెండు ఇళ్ళు ఉన్నాయి. భువనేశ్వరికి మదీనాగూడలో రూ. 9 కోట్లు విలువ చేసే వ్యవసాయ భూమి ఉన్నది. వారిద్దరికీ తమిళనాడు కాంచీపురంలో రూ. 10,49,63,700 విలువ చేసే ఒక వేర్ హౌస్ ఉన్నది. ఆశ్చర్యంగా, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రూ. 1,34,78,487 మాత్రమే విలువ చేసే ఆస్తులతో ఈ సంపన్న అభ్యర్థుల జాబితాలో అడుగున ఉన్నారు. ఆయన వద్ద బ్యాంకు బ్యాలెన్స్ రూ. 12,379. కాని ఆయన భార్య విజయలక్ష్మి వద్ద రూ. 31,069 బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. వైఎస్ఆర్ పేరిట రూ. 1.93 లక్షలు, ఆయన భార్య పేరిట రూ. 4.5 లక్షలు విలువ చేసే బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే, సిఎం వద్ద రూ. 13 లక్షలు విలువ చేసే నగలు ఉండడం. ఆయన భార్య వద్ద రూ. 10.57 లక్షలు విలువ చేసే నగలు ఉన్నాయి.
వైఎస్ఆర్ సన్నిహిత అనుచరుడు, నరసరావుపేట కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి సిఎం కన్నా ఎక్కువగానే ఆస్తులు ఉన్నాయి. బాలశౌరి ఆస్తుల విలువ రూ. 45 కోట్లు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు తరువాత స్థానం బాలశౌరిదే. కాగా, చిరంజీవి బావమరది, ప్రజారాజ్యం పార్టీ ప్రముఖుడు అల్లు అరవింద్ ఆస్తుల విలువ రూ. 24 కోట్లు మాత్రమే. కాని ఆయన భార్యకు రూ. 28 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. 'అల్లుకు కేవలం రూ. 24 కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులు ఉండడం ఆశ్చర్యకరమే. దేశంలోని అత్యంత సంపన్న చలనచిత్ర నిర్మాతలలో ఆయన ఒకరన్నది గుర్తుకు తెచ్చుకోండి' అని పరిశ్రమ విశ్లేషకుడు ఒకరు అన్నారు.
Pages: -1- 2 News Posted: 7 April, 2009
|