మళ్లీ తప్పని తిరుగు'పోటు'!
కృష్ణా జిల్లా లో ఒక్క విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఎక్కడా చిరుగుబాటు అభ్యర్ధులు బరిలో లేరు. వియవాడ పశ్చిమలో కాంగ్రెస్ అభ్యర్ధి మల్లికా బేదంపై తిరుగుబాటు అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్ే జలీల్ ఖాన్ పోటీలే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబెల్ ముత్తా గోపాలకృష్ణ, పిఠాపురంలో ప్రజారాజ్యం రెబెల్ కేతినీడి సతీష్ బాబు, ముమ్మిడివరంలో పిఆర్పీ రెబెల్ గుత్తుల సాయి, గన్నవరం(ఎస్సీ)లో పిఆర్పీ రెబెల్ యలమిల్లి అర్ునుడు, అనపర్తిలో పిఆర్పీ రెబెల్ పడాల వెంకటరామా రెడ్డి పోటీలో వున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో కాంగ్రెస్ రెబెల్ మద్దాల రాజేష్ కుమార్ , గోపాలపురం లో పిఆర్పీ రెబెల్స్ మానుకొండ హరినాధ్, బంటు గంగారత్నం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కాంగ్రెస్ రెబెల్స్ మార్కండేయ, దేవరాజు, శ్రీకాళహస్తిలో పిఆర్పీ రెబెల్ పల్లమాల సుధాకర్, కుప్పంలో కాంగ్రెస్ రెబెల్ వై.శ్రీనివాసులు, పిఆర్పీ రెబెల్ జి.సుధాకర్ శెట్టి, పూతలపట్టులో పిఆర్పీ రెబెల్ పరమానందం, అనంతపురం జిల్లా శింగనవలలో కాంగ్రెస్ రెబెల్స్ మిద్దె కుళాయప్ప, ఎం.చంద్రప్ప, ఉరవకొండలో పిఆర్పీ రెబెల్ వశికెరి శివ, ధర్మవరంలో సిపిఐ అభ్యర్ధి డి.జగదీష్ పై తెలుగుదేశం రెబెల్ వరదాపురం సూర్యనారాయణ, పెనుగొండలో తెలుగుదేశం రెబెల్ వావిలాల సునీత, కర్నలు జిల్లా ఎమ్మిగనూరులో పిఆర్పీ రెబెల్ ఎన్.శ్రీనివాసులు, ఆలూరులో కాంగ్రెస్ రెబెల్ కెశవరెడ్డి, పిఆర్పీ రెబెల్ కె.శివరాంగౌడ్ పాటీలో ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 9 April, 2009
|