పార్టీలకు ప్రతిష్టాత్మకం!
1991లో మాగుంట సుబ్బరామ రెడ్డి విజయం సాధించారు. 1996లో మాగుంట పార్వతమ్మ ఘనవిజయం సాధించారు. 204లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఘనవిజయం సాదించారు. అయితే మారిన సమీకరణల నేపథ్యంలో ఈ సారి మాగుంట గట్టి పోటీని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్ధి ఎం.ఎం.కొండయ్య ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అసెంబ్లీ అభ్యర్ధులతో అవగాహనకు రావడం, గతంలో కంటె జిల్లాలో తెలుగుదేశం బలంగా ఉండడంతో ఆ పార్టీ వర్గాలు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో రెబెల్ అభ్యర్ధులు కాంగ్రెస్ లోనే ఉండడంతో ఒంగోలు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. యాదవ వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో, గతంలో కాంగ్రెస్ కు మద్దతు పలికిన యాదవులంతా ఇప్పుడు తెలుగుదేశం వైపు దృష్టి సారిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రజారాజ్యం అభ్యర్ధి పిడతల సాయికల్పనారెడ్డి ఎంపిక అనూహ్యంగా జరిగింది. స్థానిక వ్యక్తి కానప్పటికీ మహిళల ఓట్లు కీలకం కావడం, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కుమ్ములాటలు, ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తమకు మేలు చేస్తాయని ప్రజారాజ్యం పార్టీ ఆశిస్తోంది. రెడ్డి కులస్తుల ఓట్లు అధికంగా ఉండడం, క్రాస్ ఓటింగు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలస్తోంది. ఈ నేపథ్యంలో మహిళగా మరోసారి జిల్లా ప్రజలు తనకు పట్టం కడతారనే ఆశాభావంతో ఉన్నారు. భర్త విజయకుమార్ రెడ్డి హఠాన్మరణంతో ఆమె అభిమానుల ప్రోత్సాహంతో రాజకీయాల్లో ప్రవేశించారు. మరి దశాబ్దకాలం రాజకీయ ్నుభవం గల మాగుంటను తెలుగుదేశం, ప్రజారాజ్యం అభ్యర్ధులు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
Pages: -1- 2 News Posted: 9 April, 2009
|