బ్లాక్ మనీపైనే బాబు ఆశలు!
కాంగ్రెస్ నాయకులు ఈ పథకాన్ని అవహేళన చేసినప్పుడు రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నదని, కనుక తన వాగ్దానాలను అమలు చేయడం తేలికేనని చంద్రబాబు చెప్పారు. కాని ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడినట్లున్నది. స్విస్ బ్యాంకులలోని నల్ల ధనం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. 'మేము అధికారంలోకి తిరిగి రాగానే స్విస్ బ్యాంకులలో అక్రమంగా దాచిన నల్ల ధనాన్ని స్వరాష్ట్రానికి తీసుకువస్తాం' అని చంద్రబాబు తనవి శుష్కప్రియాలు కావని వోటర్లను నమ్మించే ప్రయత్నంగా చెప్పారు.
అయితే, స్విస్ బ్యాంకులలో నుంచి నల్ల ధనాన్ని తిరిగి తీసుకురావడం తేలికేమీ కాదని న్యాయశాస్త్ర కోవిదులు అంటున్నారు. ఇందుకు స్విస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అంతర్జాతీయ సమాజం సహకారం కావలసి ఉంటుందని వారు సూచిస్తున్నారు. స్విస్ బ్యాంకులలో అక్రమంగా డబ్బు దాచుకున్న కొందరు అమెరికన్ల పేర్లను వెల్లడి చేసేట్లుగా స్విస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కృతకృత్యుడైనప్పటికీ అటువంటి పని సాధించడం ఇండియాకు తేలికేమీ కాదని వారంటున్నారు.
చంద్రబాబు ఆశలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య తన వంతుగా నీళ్ళు పోశారు. ఒకవేళ నల్ల ధనాన్ని వెనుకకు తెచ్చినప్పటికీ ఆ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి మన చట్టాలు ఒప్పుకోవని రోశయ్య స్పష్టం చేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రకటించిన నగదు బదలీ పథకం చివరకు చంద్రుని వెన్నెలే కావచ్చు.
Pages: -1- 2 News Posted: 10 April, 2009
|