రెడ్డి వోట్లకు జగన్ గాలం
'రెడ్డి వోట్లలో 20 శాతం ప్రత్యర్థి పార్టీలకు పడినా చాలు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిని చవి చూడవలసి వస్తుంది' అని ఒక విశ్లేషకుడు అన్నారు. పిడతల కుటుంబానికి చెందిన సాయి కల్పన ఇప్పటికే ఒంగోలులో మద్యం వ్యాపారవేత్త మాగుంటకు రాత్రిళ్ళు నిద్ర పట్టనివ్వడం లేదు. బలమైన కాపు వోట్లలో కూడా ఆమెకు పట్టు ఉండడం ఇందుకు కారణం. రెడ్డి కులస్థులలో ఏమాత్రం వోట్లు చీలినా ఆమెకు గెలుపు ఖాయం కాగలదు. ఇక నరసరావుపేటలో మోదుగుల 2.5 లక్షల మంది కమ్మ వోటర్ల మద్దతుతో పోటీలో ముందంజలో ఉన్నారు. 'ఆయన రెడ్డి వోట్లను చీల్చగలిగితే విజయాన్ని చవి చూడగలరు' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అంగీకరించారు.
జగన్ పల్నాడు ప్రాంతంలో జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, గడచిన ఐదు సంవత్సరాలలో భగవంతుడు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వోటు వేశాడని చెప్పారు. భగవంతుని ఆశీస్సులు ఉన్న కారణంగానే ఐదు సంవత్సరాలలో కాలానుగుణంగా వర్షాలు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. 'సత్పాలకులకు మాత్రమే భగవంతుని అండ ఉంటుందని, పేదల శ్రేయస్సు కోసం వారిని భగవంతుడు కరుణిస్తాడని మీ అందరికీ తెలుసు' అని జగన్ అన్నప్పుడు జనం పెద్ద పెట్టున నినాదాలు, హర్షధ్వానాలు చేశారు.
Pages: -1- 2 News Posted: 10 April, 2009
|