'రాజ్యం' కోటకు బీటలు!
అయితే, పైన పేర్కొన్న పిఆర్పీ నాయకులలో చాలా మంది ఈ ఎన్నికలలో మట్టి కరవబోతున్నారు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు బిసి, ఎస్ టిల నుంచి బలమైన అభ్యర్థులను వారిపై పోటీకి నిలబెట్టాయి. అరకు ఎస్ టి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ సీట్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ ఐదు చోట్ల పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టిడిపి మధ్యే ఉండేలా కనిపిస్తోంది. అనకాపల్లి లోక్ సభ స్థానంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండవచ్చు. అక్కడ పిఆర్పీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి అల్లు అరవింద్ పోటీ చేస్తున్నారు. పిఆర్పీ తిరుగుబాటు నాయకులను తిరిగి ఆకట్టుకోవడానికి, తనకు బలమైన ప్రత్యర్థులు నూకారపు సూర్యప్రకాశరావు (టిడిపి), సబ్బం హరి (కాంగ్రెస్)లను తన కుటుంబం సినీ గ్లామర్ సాయంతో దెబ్బ తీయడానికి అరవింద్ సకల యత్నాలు చేస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో కుల, వర్గ సమీకరణాలదే పైచేయి కావచ్చు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో బలమైన టిడిపి అభ్యర్థి కింజరాపు ఎర్రన్నాయుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ సాగవచ్చు. పిఆర్పీ వోట్లలో ఏమాత్రం మార్పు చోటు చేసుకున్నా ఆ అభ్యర్థులిద్దరి పరిస్థితి తారుమారు కావచ్చు. అయితే, ఇది పిఆర్పీకి ప్రయోజనం చేకూర్చకపోవచ్చు. అది మూడవ స్థానంతో సంతృప్తి చెందవలసి ఉంటుంది.
విశాఖపట్నంలో కూడా పరిస్థితి ఇదే తీరులో ఉంది. విశాఖలో ఇద్దరు బలమైన రాజకీయ ప్రత్యర్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి (కాంగ్రెస్), ఎంవివిఎస్ మూర్తి (టిడిపి)లను పిఆర్పీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఢీ కొంటున్నారు. అరకు (ఎస్ టి) నియోజకవర్గంలో పిఆర్పీ మీనక సింహాచలంను తన అభ్యర్థిగా నిలబెట్టింది. కాంగ్రస్ అభ్యర్థి కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్, సిపిఎం అభ్యర్థి ఎం. బాబూరావులను ఎదుర్కొనడం సింహాచలంకు గడ్డు పరిస్థితేనని పేర్కొనవచ్చు. చాలా చోట్ల ముక్కోణపు పోటీ జరుగుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ వాస్తవానికి పిఆర్పీ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అది రెండవ స్థానంతో లేదా మూడవ స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందేమో.
ఈ మూడు జిల్లాలోల టిడిపి, కాంగ్రెస్ అవకాశాలకు పిఆర్పీ గండి కొట్టగలదని ఆదిలో భావించారు. ఈ మూడు జిల్లాలోని 34 సీట్లలో 25 సీట్లను పిఆర్పీ కైవసం చేసుకోవచ్చుననే సూచనలు మొదట్లో గోచరించాయి. కాని ఇప్పుడు పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. పిఆర్పీకి ఆరు సీట్లు రావడమే గగనమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వచ్చిన సూచనలకు భిన్నంగా పిఆర్పీ బలమైన తిరుగుబాటు అభ్యర్థులతో సహా వివిధ కారణాలతో తృతీయ స్థానానికి దిగిపోతుందని అంటున్నారు.
పకడ్బందీ వ్యూహ రచన, మీడియాలో విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ లేదా టిడిపి కన్నా తన పార్టీ ఎంతో మెరుగు అనే నమ్మకాన్ని చిరంజీవి జనంలో కలిగించలేకపోతున్నారు. 'ప్రస్తుత పరిస్థితిలో పార్టీకి 13 నుంచి 18 శాతం వరకు వోట్లు రావచ్చు. మొదటి సారి వోట్లు వేస్తున్నవారు, ఆయన అభిమానుల నుంచి ఈ వోట్లు పడవచ్చు' అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు.
తన సామాజిక న్యాయం సిద్ధాంతం ద్వారా ప్రత్యర్థి పార్టీలను కుదిపివేయాలని చిరంజీవి ఆకాంక్షించారని, కాని ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేయడంలో ఆయన విఫలమైన తరువాత పార్టీలో ఆ ఊపు తగ్గిందని పిఆర్పీ పోల్ మేనేజర్ ఒకరు అంగీకరించారు. ఆయన అందుకు బదులుగా ప్రత్యర్థి పార్టీలను తమ లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం కలిగించారని పార్టీ పరిశీలకులు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 11 April, 2009
|