'మిత్ర' ద్రోహం?
నెల్లూరు, గోదావరి జిల్లాల్లో మరో మూడు సీట్లు మిత్రా అకౌంట్ లోకి వెళ్లాయని, ఒక్కో సీటుకు ఐదు కోట్లు చొప్పున మొత్తం 15 కోట్ల రూపాయలు ఆయనకు ముట్టాయని, అందులో ఐదు కోట్లే పార్టీకి ఇచ్చారని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. ఆయన దాచుకున్న పదికోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారాలు పార్టీ సీనియర్ల వద్ద ఉన్నాయని, మిత్రా రాజీనామా గురించి తెలియగానే ఆయనపై ఆ ఆ ఆధారాలను అస్త్రంగా ప్రయోగించారని, పార్టీని విడిచిపెడితే గుట్టు రట్టు చేసి జనం తిరగబడేట్టు చేస్తామని హెచ్చరించారట! దాంతో భయపడిన మిత్రా చివరి నిముషంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుని పార్టీలో సర్దుకుపోతున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు. మిత్రా తన కోపాన్ని అతికష్టం మీద అదుపు చేసుకుంటున్నారని, పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు బిపి మాత్రలు మింగుతున్నారని ఓ సీనియర్ నాయకుడు అన్నారు.
Pages: -1- 2 News Posted: 11 April, 2009
|