కెసిఆర్ షో ఫ్లాప్!
మంచిర్యాలలోని సిసిసి క్రాస్ రోడ్స్ వద్ద సభ ఏర్పాట్లను చూసిన కెసిఆర్ నిర్ఘాంతపోయి, అక్కడ పోటీచేస్తున్న తమపార్టీ అభ్యర్ధి గడ్డం అరవిదరెడ్డి ఇంటికి వెళ్లి జన సమీకరణకు మొక్కుబడిగా ఏర్పాట్లు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఇలాగే జరగడంతో స్థానిక నాయకులపై ఆయన అసహనంగా రుసరుసలాడి, సభలకు ముఖం చాటేసి వెళ్లిపోయారు. మంచిర్యాలలో గంటసేపు వేచి చూసినా జనం రాకపోవడంతో హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. మండటెండల్లో సభలకు రావడానికి జనం ఇష్టపడకపోవడం, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం, కూటమి నాయకుల మధ్య సమన్వయ లోపం తదితర కారణాల వల్లే కెసిఆర్ ప్రచార సభలు వెలవెల పోయాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 12 April, 2009
|