మనీ, మందు కాక్ టెయిల్!
రహ్మత్ నగర్ లో నగదు పంపిణీ కార్యక్రమం ఆదివారం మాత్రమే ప్రారంభం కాగా, అడ్డగుట్ట ప్రాంతంలో గడచిన వారం రోజులుగా ఇది సాగుతోందని స్థానికులు తెలియజేశారు. 'గత కొన్ని రోజులలో కొందరు వ్యక్తులు ఒక్కొక్కరూ రూ. 1000 ఆర్జించారు' అని స్థానికుడు ఒకరు తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా తలసాని శ్రీనివాస యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి జయసుధను ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మక్త ప్రాంతంలో మురికివాడలో రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లకు నగదు, మద్యం పంపిణీ బాధ్యతను అప్పగించారు. 'మంగళవారం రాత్రి నుంచి నగదు, మద్యం అందుతాయని మాకు తెలియజేశారు' అని పండ్ల వర్తకుడు మహమ్మద్ యూసుఫ్ చెప్పాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో విమానాశ్రయం వెనుక గల ఒక మురికివాడలో స్థానిక నాయకులు ఇప్పటికే డబ్బు పంపిణీ చేశారు.
వాస్తవానికి నామినేషన్లు దాఖలు చేసిన రోజు నుంచే మురికివాడల వాసులకు రాజకీయ పార్టీలు తమ ఏజెంట్ల ద్వారా మహారాజ పోషకులుగా పాత్రను నిర్వహిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇప్పుడు స్థానిక సామాజిక వర్గాలతోను, యువజన సంఘాలతోను చర్చలు జరుపుతూ వారు ప్రభావితం చేయగల జనం వోట్లు సంపాదించడానికి ఎంత మొత్తం చెల్లించాలో నిర్థారించసాగారు. ఇందుకోసం ఒక గ్రూపు నాయకునికి రూ. 25 వేలు నుంచి రూ. 40 వేలు వరకు ఇవ్వజూపినట్లు ఒక ప్రతినిధి తెలియజేశారు. స్థానికుల సమాచారం ప్రకారం, గత ఉప ఎన్నికలలో మెట్టుగూడ, లాలాగూడ, చిల్కలగూడ, అడ్డగుట్ట వంటి వివిధ మురికివాడలలో రాజకీయ నాయకులు రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ దఫా ఈ మొత్తం ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు.
Pages: -1- 2 News Posted: 14 April, 2009
|