టైర్ ట్యూబుల్లో డబ్బు
జిల్లాలలో చాలా చోట్ల డబ్బును ఒక స్థానిక నాయకుని బ్యాంకు ఖాతాలోకి బదలాయిస్తున్నారు. 'పలు సందర్భాలలో వారు వర్తకులు అవుతుంటారు. వారు ఆతరువాత వోటర్లకు రహస్యంగా డబ్బు పంపిణీ చేస్తుంటారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో డబ్బును ఒక ప్రముఖ, విధేయులైన స్వయం సహాయక గ్రూపు నాయకుని బ్యాంకు అకౌంట్లలో డబ్బు డిపాజిట్ చేస్తున్నారు. ఆ నా.యకుడు ఆ డబ్బును పంపిణీ చేస్తారు. సోమవారం అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రచార నిర్వాహకులు ముమ్మరంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'మద్యం దుకాణాలను వచ్చే మూడు రోజుల పాటు మూసివేస్తారు కనుక వోటర్లు డబ్బును ఇవాళే ఇవ్వాలని కోరుతున్నారు. పైగా పోలింగ్ ముందు రోజా రాత్రి కీలకమైనది కనుక మేము స్వయంగా కొంత నిల్వ చేసుకోవలసిన అవసరం ఉంది' అని ఒక ప్రచార నిర్వాహకుడు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 14 April, 2009
|