'కూల్'గా ఓటు వేశారు
కాగా, కెపిహెచ్ బి ఐదవ ఫేజ్ ఓటర్లు కూడా మొట్టమొదటి సారిగా 'చల్లటి' వాతావరణంలో ఓట్లు వేస్తున్నందుకు ఆశ్చర్యపోయారు. క్లబ్ హౌస్ ప్రాంగణంలో పలు రెస్టారెంట్లు, ఆహారపు దుకాణాలు ఉండడంతో ఎన్నికల రోజు పండుగ వాతావరణాన్ని తలపించింది. ఓటర్లు తమ కుటుంబాలతో ఓట్లు వేయడానికి వచ్చి అక్కడి సౌకర్యాలను అనుభవించారు.
'ఎండ మరీ ఎక్కువగా ఉంది. చాలా వరకు పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి సౌకర్యాలూ ఉండవు., నేను బూత్ లోకి అడుగు పెట్టినప్పుడు ఆశ్చర్యచకితుడినయ్యాను. గత నాలుగు ఎన్నికలలో ఓటు వేసిన నా వంటి వ్యక్తికి ఇది భిన్నమైన ఓటింగ్ అనుభవం. ఇటువంటి సౌకర్యాలను ప్రతిచోటా కల్పించినట్లయితే, వచ్చే ఓటర్ల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండగలదని నా భావన' అని పి. రామయ్య అనే ఓటరు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 17 April, 2009
|