మద్యం, డబ్బుకు గ్రామం నో
నరసింగపల్లి గ్రామంలోను, తండాలోను 1615 మంది ఓటర్లు ఉన్నారు. వారు తమంతట తాముగానే గురువారం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రాలలో పార్టీల ఎన్నికల ఏజెంట్లు కూడా లేరు.
'స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేట్లు చూసేందుకు మేము కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నాం' అని కల్వరాల రాజు బాయి అనే మహిళా ఓటర్ చెప్పింది. 'డబ్బు, మద్యం వద్దన్నందుకు నిరాశ చెందిన వారు కొద్ది మంది ఉన్నమాట నిజమే. కాని త్వరలోనే గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కాగలవని మేము ఆశిస్తున్నాం' అని ఆమె చెప్పింది.
నగదు, మద్యం పంపిణీని గట్టిగా 'వద్దు' అన్నందుకు తాము గర్విస్తున్నామని మరొక గ్రామస్థుడు బాలయ్య చెప్పాడు.
'ఎటువంటి పక్షపాతం చూపకుండా మొత్తం గ్రామ ప్రజలు పోలింగ్ లో పాల్గొన్నారు' అని సర్పంచ్ కట్రోత్ అక్కూబాయి తెలియజేసింది. 'గ్రామంలోని మద్యం దుకాణాలను గడచిన నాలుగు రోజులుగా మూసివేయించాం కూడా' అని ఆమె చెప్పింది.
'పోలింగ్ ఇంత సాఫీగా సాగిపోవడం ఇంతకు ముందు ఎన్నడూ మేము చూడలేదు' అని బి. ఆనంద్ అనే గ్రామస్థుడు చెప్పాడు.
Pages: -1- 2 News Posted: 17 April, 2009
|