రెండోవిడత మూడు ముక్కలాటే!
కృష్ణా, గంటూరు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రెండు జిల్లాల్లో కూడా తమకే మెజారిటీ స్థానాలు లభిస్తాయని తెలుగుదేశం అంచనా వేస్తోంది. ్యితే బలమైన పార్టీ యంత్రాంగం, నాయకత్వం ఉన్నందువల్ల ఆ రెండు జిల్లాల్లో ఆధిక్యత తమదేనని కాంగ్రెస్ ధీమావ్యక్తం చేస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల బలం రమారమి సమానంగా ఉండొచ్చని పరిసీలకులు చెబుతున్నారు. ఇక రాయలసామ విషయానికి వస్తే, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రజారాజ్యం ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల కర్నూలులో తెలుగుదేశం పార్టీకి, కడప, చిత్తూరు జిల్లాల్లో కాంగ్రెస్ కు కొంత నష్టం కలుగవచ్చని చెబుతున్నారు.
చిరంజీవి పోటీ చేస్తున్న తిరుపతి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీలో వున్నారు. చిరంజీవి పోటీచేస్తున్న కారణంగా ప్రజారాజ్యం అగ్ర నాయకుల దృష్టి అంతా ఇక్కడే వుంది. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల బలం మొదటి నుండి సమానంగానే వుంది. ఒకటి రెండు స్తానాలు అటూ ఇటూగా చెరిసగం సీట్లు గెలుచుకుంటాయి. అయితే ఈ సారి కాంగ్రెస్ బాగా పుంజుకుందని, తెలుగుదేశం కంటె ఎక్కువ సీట్లు తమకు వస్తాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీల కంటె స్థానికంగా వుండే ముఠాల మీదనే ఇక్కడ అభ్యర్ధుల విజయం ఆధారపడి ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|