నక్సల్స్ సంయమనం
ఇందుకు భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 11న ఒకే ఒక సంఘటన మాత్రమే చోటు చేసుకున్నది. ఆ రోజు విశాఖపట్నం జిల్లా జికె వీధిలో కాంగ్రెస్ జడ్ పిటిసి మామిడి చందర్ రావును తన పదవికి రాజీనామా చేయవలసిందిగా మావోయిస్టులు బెదరించారు.
ఆంధ్ర ప్రదేశ్ 1994 అసెంబ్లీ ఎన్నికలలో దారుణమైన నక్సలైట్ల హింసాకాండను చవిచూసింది. అప్పుడు 15 మంది పోలీసు సిబ్బందితో సహా 25 మంది వ్యక్తులు హతులయ్యారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలలో మందుపాతర పేలుళ్ళలో ఆ పోలీసు సిబ్బంది, మరి నలుగురు పౌరులు దుర్మరణం చెందారు. ఆ తరువాత 1999 అసెంబ్లీ ఎన్నికలలో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో తెలుగుదేశం ఎంఎల్ఎ పి. పురుషోత్తమరావును, హైదరాబాద్ లో పోలీస్ ఉన్నతాధికారి సి. ఉమేష్ చంద్రను తీవ్రవాదులు హతమార్చారు.
2000లో మునిసిపల్ ఎన్నికల సమయంలో నక్సల్స్ మందుపాతర పేల్చి రాష్ట్ర హోమ్ శాఖ మాజీ మంత్రి ఎ. మాధవరెడ్డిని హతమార్చారు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో శ్రీకాకుళంలో అదే విధంగా నక్సల్స్ మందుపాతర పేల్చినప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు గాయపడ్డారు.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|