వార్న్'రాయల్స్' భంగపాటు
ఈ మ్యాచ్ లో షేన్ వార్న్ స్పిన్ మాయాజాలం కాని, కెప్టెన్సీ వ్యూహం కాని ఏ మాత్రం ఫలించలేదు. కేవలం రెండు మంచి బంతులతో విరాట్ కోహ్లి, బి.అఖిల్ లను ఔట్ చేసి తన కోటా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చాడు. మిగిలిన బౌలర్లలో డిమిట్రి మస్కరెనాస్ 20 పరుగులకు 3 వికెట్లు, మునాఫ్ పటేల్ 25 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు. బెంగుళూరు జట్టు ఇన్నింగ్స్ రెండో బంతికే న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జెస్సీ రైడర్ ను మస్కరెనాస్ డకౌట్ చేసి, ఆ
తరువాత రాస్ టోలర్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో, మొదటి ఓవర్ పూర్తయ్యే సరికి బెంగుళూర్ జట్టు 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రాబిన్ ఉతప్పకూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరుకోవడంతో 5 ఓవర్లు పూర్తయ్యే సరికి మాల్య జట్టు 17/3 స్కోరుతో కష్టాల్లో చిక్కుకుంది.
ఆ తరువాత ద్రవిడ్, పీటర్సన్ జాగ్రత్తగా ఆడి స్కోరును 50 పరుగులు దాటించారు. ఇంగ్లండ్ సహచరుడు ఆండ్రూ ఫ్లింటాఫ్ తో పాటు ఈ టోర్నీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరుపొందిన ఫ్లింటాఫ్ 30 బంతులు ఎదుర్కొని, నలుగు బౌండరీలతో 32 పరుగులు చేశాడు. తొమ్మిదో ఓవర్ లో జట్టు స్కోరు 52 పరుగుల వద్ద ఔటయ్యాడు.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|