అజారుద్దీన్ సెంచరీ!
గత పిబ్రవరి 19న అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, అతడికి ఆంధ్రప్రదేశ్ లోని సికిందరాబాద్ స్థానం కేటాయిస్తారని అందరూ అనుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం వారి ఊహాగానాలను తలకిందులు చేస్తూ మొరాదాబాద్ నుండి పోటీచేయాలని ఆదేశించింది. ఈ ప్రతిపాదనను తాను సంతోషంగా స్వీకరించానని, మొరాదాబాద్ లో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని చెబుతున్నాడు. 'ఇది నాకు వందో టెస్ట్ మ్యాచ్. ఎన్నికల్లో పోటీ చేయడం టెస్ట్ మ్యాచ్ ఆడ్డం లాంటిదే. లోక్ సభకు ఎనవ్నికై, ీ టెస్ట్ ను సొంతం చేసుకుంటాను' అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మిగతా వర్గాల ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలితే, ముస్లిం ఓట్లు తనకే పడతాయన్నది అతడి నమ్మకం. అదే నిజమైతే సెంచరీ కొట్టినట్టే!
Pages: -1- 2 News Posted: 19 April, 2009
|