'రెండో' ప్రచారానికి తెర
ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పరిశీలకులకు ఉత్కంఠభరితంగా మారాయి. కోస్తా, రాయలసీమ ఓటర్ల తీర్పు పైనే అన్ని పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంది. అందువల్లనే ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటు హామీల వర్షాలు కురిపిస్తూ, అటు ఒకరిపై ఒకరు దమ్మెత్తి పోసుకుంటున్నారు. అధికారం నిలబెట్టుకోడానికి వైఎస్, పోయిన అధికారాన్ని మళ్లీ దక్కించుకోడానికి చంద్రబాబు, సామాజిక న్యాయం కోసం మార్పు పేరుతో రాజకీయరంగ ప్రవేశం చేసిన చిరంజీవి ఓటర్లను ఆకర్షించడంలో నిమగ్నమై వున్నారు.
Pages: -1- 2 News Posted: 20 April, 2009
|