అందరి చూపు తూగోపైనే
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తుని సెగ్మెంట్ నుంచి ఏడవసారి పోటీచేస్తున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఎక్సైజ్, మద్యనిషేధం శాఖ మంత్రి జక్కంపూడి రామమోహనరావు ఆరోగ్య కారణాలపై ఈ దఫా పోటీచేయడం లేదు. కాని ఆయన బదులు ఆయన భార్య విజయలక్ష్మి కొత్తగా ఏర్పాటైన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికలలో అనేక మంది కొత్త అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ వివిధ పార్టీల పాత కాపులకు చెమటలు పట్టిస్తున్నారు.
ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏ పార్టీకి కీలకమైన ఈ జిల్లా ఓటర్లు అవకాశం కల్పిస్తారా అని ఆలోచిస్తూ అన్ని పార్టీల నేతలు నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతున్నారు.
Pages: -1- 2 News Posted: 20 April, 2009
|