పట్టు వీడని ఫ్యాక్షన్ భూతం
వారి లక్ష్యాలు ఏవో గూఢచారులకు తెలుసు. తమ కిరాతక వ్యూహాన్ని అమలు పరిచేందుకు వారు ఎన్నికల సమయాన్ని ఉపయోగించుకోవచ్చునని గూఢచారులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఒక నిషిద్ధ బోర్ తుపాకీతో ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతను తన ప్రత్యర్థిని హతమార్చడానికి దానిని నక్సలైట్ల వద్ద నుంచి లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. అతనిని సకాలంలో అరెస్టు చేసి ఉండకపోతే, కడపలో ఒక నిర్దుష్ట ఫ్యాక్షన్ గ్రామం పగలతో అట్టుడికిపోవడం, జిల్లా అంతటా ఉద్రిక్తత నెలకొనడం జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు.
'వివిధ ప్రాంతాలలో సంచరిస్తున్న టార్గెట్లు అందరికీ మేము రక్షణ కల్పిస్తున్నాం. ప్రధాన సమస్య ఏమిటంటే ఎన్నికల ప్రచారం సమయంలో ఏ విధమైన హింసాత్మక సంఘటన సంభవించినా అది సంక్షోభానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఫ్యాక్షనలిస్టుల మధ్యే కక్షలు ఉన్నప్పటికీ దానిని రాజకీయ హింసాకాండగా చిత్రిస్తారు' అని డిఎస్ పి ఒకరు చెప్పారు.
72 ఫ్యాక్షన్ ప్రాబల్య గ్రామాలలోకి కమలాపురం, లింగాల, పెండ్లిమరి, యెర్రగుంట్ల, చిన్నదందులూరు, కొండాపురంలలో నిఘాను ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
'రక్తానికి రక్తం అనే సిద్ధాంతం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆచరణలో ఉంటున్నది' అని అధికారి ఒకరు చెప్పారు. తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
Pages: -1- 2 News Posted: 21 April, 2009
|