కోస్తాపై పిఆర్పీ చూపు
కాని చిరంజీవి సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పార్టీకి అసాధారణ రీతిలో స్పందన లభించింది. ఇది కనీసం ఏడు శాసనసభ నియోజకవర్గాలలో పార్టీకి గణనీయంగా లబ్ధి చేకూర్చవచ్చు. రెండు నెలల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి సరళే కనిపించినప్పటికీ, గడచిన నాలుగు వారాలలో టిడిపి అభ్యర్థులు గణనీయమైన పురోగతి సాధించారు. దీనితో పిఆర్పీకి పరిస్థితి గడ్డుగా మారింది. ఆ జిల్లాలో కనీసం ఐదు నియోజకవర్గాలలో పిఆర్పీ అసాధారణ స్థాయిలో ఓట్లు సంపాదించగలదని ఆశిస్తున్నారు.
అయితే, పొరుగున ఉన్న కృష్ణా జిల్లాలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. బూరగడ్డ వేదవ్యాస్ (మచిలీపట్నం), వంగవీటి రాధాకృష్ణ (విజయవాడ సెంట్రల్), కామినేని శ్రీనివాస్ (కైకలూరు), రావి వెంకటేశ్వరరావు (గుడివాడ) వంటి జనాదరణ గల స్థానిక నాయకులను పార్టీలోకి రప్పించగలిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గల ఓటు బ్యాంకుకు పిఆర్పీ పెద్దగా గండి కొట్టలేకపోయింది. జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్, టిడిపిలతో పిఆర్పీ ముక్కోణపు పోటీని ఎదుర్కొన్నది. రెండు నియోజకవర్గాలలో పిఆర్పీకే మొగ్గు ఉండవచ్చు. ఆయా అభ్యర్థుల బలమే ఇందుకు ప్రధాన కారణం.
ఇక గుంటూరు (17), ప్రకాశం (12), నెల్లూరు (10 నియోజకవర్గాలు) జిల్లాలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులకు అమోఘమైన రీతిలో మద్దతు లభించింది. చిరంజీవి ప్రతిష్ఠ, ఆయన సామాజిక న్యాయ సిద్ధాంతం ఇందుకు ప్రధాన కారణాలు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొందరు ప్రముఖ అభ్యర్థులలో గుంటూరు జిల్లా నుంచి కత్తి పద్మారావు (వేమూరు), తులసి రామచంద్ర ప్రభు (గుంటూరు వెస్ట్), పోసాని కృష్ణమురళి (చిలకలూరిపేట), ప్రకాశం నుంచి వల్లెపు రాఘవులు (కందుకూరు), నెల్లూరు జిల్లా నుంచి తుపాకుల మునెమ్మ (కోవూరు), సి.వి. శేషారెడ్డి (సర్వేపల్లి) కూడా ఉన్నారు.
ఇక 11 పార్లమెంటరీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తే పోటీ ప్రధానంగా టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే సాగిందని చెప్పవచ్చు. నరసాపురంలో మాత్రం పిఆర్పీ ఆశ్చర్యకరమైన ఫలితం సాధించవచ్చు. పిఆర్పీ పార్లమెంటరీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. కుల, వర్గాల వారీగా ఓట్లు చీలిపోయాయి.
రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, అనంతపురం జిల్లాలలోని కొన్ని చోట్ల తప్ప ఇతర నియోజకవర్గాలలో పిఆర్పీ తన ప్రత్యర్థుల కన్నా బాగా వెనుకబడింది. పార్టీ కర్నూలు జిల్లాలోని 14, అనంతపురం జిల్లాలోని 14, కడప జిల్లాలోని 10, చిత్తూరు జిల్లాలోని 14 శాసనసభ నియోజవకవర్గాలలో పోటీ చేసింది.
Pages: -1- 2 News Posted: 23 April, 2009
|