అందరూ ఆశాజీవులే!
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కూడా తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు. మొత్తం 160 సీట్లు సాధిస్తామని, తమది నిశ్శబ్ద విప్లవమని ప్రకటించారు. ప్రజలు తమవైపే ఉన్నారని, కౌంటింగ్ పూర్తయ్యాక తమ సత్తా వెల్లడవుతుందని ధీమాగా చెబుతున్నారు. ఇక బిజెపి తాము అధికారంలోకి వస్తామని చెప్పకపోయినా, 2004 కంటె ఎక్కువ సీట్లు సాధిస్తామని ప్రకటించింది. గత ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే వచ్చాయని, ఈసారి కనీసం 20 అసెంబ్లీ సీట్లు, 5 లోక్ సభ సీట్లు గెలుచుకుంటామని దత్తాత్రేయ చెబుతున్నారు. కొత్త తరానికి కొత్త రాజకీయ నినాదంతో ఆవిర్భవించిన లోక్ సత్తా పార్టీ ఈసారి ఎన్నికల్లో సుమారు 10 శాతం ఓట్లు సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేస్తోంది. వ్యవస్థ మార్పుకోసం ఆవిర్భవించిన తమకు సీట్లు ప్రధానం కాదని, మార్పే లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో పార్చీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Pages: -1- 2 News Posted: 24 April, 2009
|