తగ్గిన 'మహా' ఉత్సాహం
అయితే, హంగ్ శాసనసభ ఏర్పడిన పక్షంలో చిరంజీవి తమ పార్టీకి మద్దతు ఇవ్వవచ్చునని కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి నాయకులు కొందరు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. పిఆర్పీ గుర్తుపై ఎన్నికైన ఎంఎల్ఎలలో మెజారిటీ సభ్యులు మాజీ టిడిపి నాయకులు అయినందున వారు 'స్వగృహానికి తిరిగి రావడానికి' సుముఖంగా ఉండగలరని టిడిపిలోని ఇతర నాయకులు ఆశిస్తున్నారు.
'ఫిరాయింపుల నిషేధ చట్టం ఉన్నప్పటికీ దానిని అమలు చేయడం సులభం కాదు. టిఆర్ఎస్ తిరుగుబాటు ఎంఎల్ఎల విషయంలో ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ విషయాన్ని నిర్ణయించడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది' అని టిడిపి నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, టిడిపి అధినేతకు ముందు తేల్చవలసిన ఇతర సమస్యలు ఉన్నాయి. కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై చంద్రబాబు సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ తో చర్చించవలసి ఉన్నది. కరత్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోగానే విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్ళి సమావేశం అవుతారు. ఆ తరువాత టిడిపి పొలిట్ బ్యూరో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చ జరుపుతుంది.
Pages: -1- 2 News Posted: 27 April, 2009
|