చంద్రబాబుకు పిఎం ఛాన్స్?
అద్వానీకి ప్రధాని పీఠం కట్టబెడితే తమపై మతముద్ర పడుతుందని ప్రాంతీయ పార్టీల భయం. అంతేకాకుండా ఆ పార్టీల నాయకులు కొందరికి ప్రధాని పదవిపై ఆశలున్నాయి. కాని వారికి ఇతర పార్టీల మద్దతు లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్క చంద్రబాబు మాత్రమే జాతీయస్థాయిలో చక్రం తిప్పగల నాయకుడుగా వారందరికీ కనిపిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి మినహా దాదాపు అన్ని పార్టీలు ఆయనకు తప్పకుండా మద్దతు ఇస్తాయి. అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు, ఇతర దేశాల రాజకీయ పార్టీల సహకారం కూడా ఆయనకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి స్వీకరించేందుకు ఆయనను ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Pages: -1- 2 News Posted: 27 April, 2009
|