కాంగ్రెస్ కు పిఆర్పీ మద్దతు!
మరి కాంగ్రెస్ కు పిఆర్పీ ఎందుకు మద్దతు ఇస్తుంది? హంగ్ శాసనసభ ఏర్పడుతుందని జోస్యం చెబుతున్న నాయకుల అభిప్రాయం ప్రకారం, టిడిపి నుంచి వచ్చిన నాయకులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఇష్టపడకపోవచ్చు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ)కి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) విముఖంగా ఉండకపోవచ్చుననే సూచనలు వస్తుండడంతో టిడిపి నాయకత్వంలోని మహా కూటమిలో టిఆర్ఎస్ భాగస్వామ్య పక్షం కనుక టిడిపికి పిఆర్పీ మద్దతు ఇవ్వకపోవచ్చునని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఎన్ డిఎ వెంట ఉండే పార్టీలకు మద్దతు ఇవ్వకపోవడం ద్వారా తనది సెక్యులర్ తత్వమని ప్రచారం చేసుకోవాలని పార్టీ అభిలషిస్తున్నదని, ఇటువంటి వ్యూహం దీర్ఘకాలంలో పార్టీకి ప్రయోజనకారి కాగలదని ఆ నాయకులు చెబుతున్నారు.
పార్టీ కనుక కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్లయితే, తన లక్ష్యాలు కొన్నిటిని సాధించవచ్చునని వారు సూచిస్తున్నారు. బిసి ముఖ్యమంత్రి కోసం పార్టీ పట్టుబట్టవచ్చునని, బిసి అనుకూల విధానాలు అనుసరించాలని కోరవచ్చునని, దీని వల్ల ఆ వర్గాలలో తన పట్టుని పార్టీ పెంచుకోవచ్చునని వారు అంటున్నారు. టిడిపి ఏకాండి పార్టీ కనుక పిఆర్పీ షరతులకు ఆ పార్టీని ఒప్పించడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
పిఆర్పీలో చేరిన నాయకులు అనేక మంది టిడిపి నుంచి వచ్చినవారే అయినందున, టిడిపి నాయకులతో వ్యక్తిగత స్పర్థలు ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదన ఏదైనా బెడిసికొట్టగలదని ఆ నాయకులు భావిస్తున్నారు. పైగా, పార్టీ ఆవిర్భావ సమయం నుంచి పిఆర్పీ కాంగ్రెస్ పట్ల సరళ వైఖరిని అనుసరిస్తున్నదని, ఎఐసిసి చైర్ పర్సన్ సోనియా గాంధి, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధి రాష్ట్రంలో తమ ఎన్నికల ప్రచార సభలలో పిఆర్పీపైన విమర్శలు చేయలేదని వారు చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 27 April, 2009
|