వినుకొండపై 40 కోట్ల వర్షం
గుంటూరు (వెస్ట్) నియోజకవర్గంలో పిఆర్పీ అభ్యర్థి టి. రామచంద్రప్రభు రూ. 14 కోట్ల మేరకు పంపిణీ చేశారు. ఆయన తులసి సీడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్. టిడిపి అభ్యర్థి చుక్కపల్లి రమేష్ రూ. 10 కోట్లు పంపిణీ చేశారు. రమేష్ పంపిణీ చేసిన డబ్బు మొత్తం ఎన్ఆర్ఐల నుంచి అందిన నిధులలోవే. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా రూ. 5 కోట్లు నుంచి రూ. 6 కోట్లు వరకు పంపిణీ చేసినట్లు రెడ్డి తెలిపారు. ఈ నియోజకవర్గంలోని 2.15 లక్షల మంది వోటర్లలో దాదాపు 50 వేల మంది ఒక్కొక్కరు రూ. 1000 నుంచి రూ. 2000 వరకు అందుకున్నట్లు ఎలక్షన్ వాచ్ వెల్లడించింది.
కుప్పం, పులివెందుల నియోజకవర్గాలలో కూడా డబ్బు పంపిణీ జరిగినట్లు ఈ సంస్థ అధికారులు తెలియజేశారు. కుప్పంలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పులివెందులలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పోటీ చేసిన విషయం విదితమే. అయితే, ఎన్నికల ప్రచారం సమయంలో తమ వోటు బ్యాంకును పటిష్ఠం చేసుకోవడానికై ఈ డబ్బును పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు. చిరంజీవి పోటీ చేసిన పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాలలో వోటర్లకు పిఆర్పీ నాయకులు డబ్బు పంపిణీ చేశారు. అయితే, పిఆర్పీ బలహీనంగా ఉన్న గ్రామాలు, కాలనీలలో మాత్రమే డబ్బు పంపిణీ జరిగింది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలలో అభ్యర్థులు రాష్ట్రంలోనే అత్యల్ప మొత్తాలు ఖర్చు చేశారని లక్ష్మణ్ రెడ్డి తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 28 April, 2009
|